- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి తర్వాత మండలాధ్యక్షుల నియామకం : మీనాక్షి నటరాజన్
డీసీసీ నూతన కార్యవర్గాల జాబితాను వచ్చేనెల ఒకటో తేదీ లోగా తమకు అందజేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను టీపీసీసీ ఆదేశించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : డీసీసీ నూతన కార్యవర్గాల జాబితాను వచ్చేనెల ఒకటో తేదీ లోగా తమకు అందజేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను టీపీసీసీ ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నూతన డీసీసీ చీఫ్ లతో టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. డీసీసీ కార్యవర్గాల కూర్పుపైన అనుసరించాల్సిన విధివిధానాలను వారికి సూచించారు. డీసీసీ కమిటీల కూర్పులో ప్రధానంగా ఇప్పుడున్న కమిటి సబ్యులకంటే గతంలో పదవులను రాని నేతలకు ప్రధాన్యత ఇవ్వాలని, కనీసం 5 నుంచి 6 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నూతన కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 60శాతం, దీనితో పాటు మహిళలకు 30శాతం చోటు కల్పించాలని తెలిపారు.
కార్యవర్గంలో ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శిని, ఒక బ్లాక్ నుంచి ఒక ఉపాధ్యక్షుడిని, ఇద్దరు కార్యదర్శులకు చోటు కల్పించాలన్నారు. ఈ కార్యవవర్గ కూర్పులో జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతల అభిప్రాయాలను కూడా పరిగణిలోకి డీసీసీ చీఫ్లు తీసుకోవాలని ఆదేశించారు. తమకు అందిన జాబితాలను పరిశీలినంతరం నూతన జిల్లా కార్యవర్గాలకు ఆమోదముద్ర వేస్తామని టీపీసీసీ తెలిపింది. దీనితో పాటు సంక్రాంతి తర్వాత పార్టీ నూతన మండలాధ్యక్షుల నియామకం కూడా చేపట్టనున్నట్లుగా కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలిపారు.






