జల వివాదాల కేసులకు అడ్వొకేట్ల నియామకం..

by Kema Shiva Kumar |

అంతర్రాష్ట్ర జల వివాదాల కేసుల్లో తెలంగాణ వాదనలను సుప్రీంకోర్టు, కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలంగా వినిపించేందుకు ప్రభుత్వం ఇద్దరు జూనియర్ అడ్వకేట్లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

జల వివాదాల కేసులకు అడ్వొకేట్ల నియామకం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్రాష్ట్ర (Inter-State) జల వివాదాల కేసుల్లో తెలంగాణ ప్రభుత్వ వాదనలు మరింత సమర్థవంతంగా వినిపించేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇరిగేషన్ విభాగం పరిధిలో ప్రభుత్వం జూనియర్ అడ్వొకేట్లను నియమించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. చైతన్య సింగ్, సంచితా ద్వివేది సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. వీరు సుప్రీంకోర్టు, కృష్ణా ట్రిబ్యునల్ ముందు కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాల వ్యవహారాల్లో రాష్ట్రం తరఫున వాదనలు వినిపిస్తారు. సంబంధిత అడ్వొకేట్ల ఫీజుల నిర్ణయం, విధుల పరిధిపై ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించాలని ఈఎన్సీ (ENC)కి ఆదేశాలు జారీ అయ్యాయి.

Next Story