త్రిపుర గవర్నర్‌గా నియామకం.. ఇంద్రసేనా రెడ్డి రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   (  Updated:2023-10-19 06:14:50  IST  )

త్రిపుర గవర్నర్‌గా బీజేపీ నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే.

త్రిపుర గవర్నర్‌గా నియామకం.. ఇంద్రసేనా రెడ్డి రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: త్రిపుర గవర్నర్‌గా బీజేపీ నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. కాగా తనను త్రిపుర గవర్నర్ గా నియమించిన తర్వాత తొలిసారి నల్లు ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్రిపుర ప్రభుత్వం నుంచి ఉదయం ఫోన్ వచ్చిందన్నారు. బీజేపీలో ఉన్న వారికి గుర్తింపు వస్తుందన్నారు. గవర్నర్ గా నియమించడం పట్ల ఇంద్రసేనారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన ఈ గుర్తింపు మలక్ పేట ప్రజలకు దక్కుతుందన్నారు. మలక్ పేట ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, నడ్డాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ ముగ్గురి మార్గదర్శనంలో పనిచేస్తానన్నారు.

Next Story