విద్యాదాన్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

by Naga Rani Yarlagadda |

ఇంటర్, పాలిటెక్నిక్‌లలో మొదటి సంవ‌త్స‌రం ప్రవేశాలు పొందే విద్యార్దుల కొర‌కు స‌రోజిని దామోద‌ర్ ఫౌండేషన్ అందిస్తున్న విద్యాదాన్ స్కాలర్‌షిప్‌లకు అర్హులైన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యాదాన్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి
X
  • మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్, పాలిటెక్నిక్‌లలో మొదటి సంవ‌త్స‌రం ప్రవేశాలు పొందే విద్యార్దుల కొర‌కు స‌రోజిని దామోద‌ర్ ఫౌండేషన్ అందిస్తున్న విద్యాదాన్ స్కాలర్‌షిప్‌లకు అర్హులైన విధ్యార్దులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలలో పదవ తరగతిలో 90 శాతం సాధించి, సంవత్సర ఆదాయం 2 లక్షలు కలిగిన వారు స్కాలర్షిప్ లు పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. విద్యార్ధులు తమ పదవ తరగతి మార్కుల మెమో , ఆదాయ ద్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో www.vidyadaan.org అనే వెబ్‌సైట్ నందు జూన్ 20 వ తేదీలోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైనవారికి జులై 5, వ తేదీన ఆన్‌లైన్‌లోపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించ బడుతుందని దీంట్లో మెరిట్ సాధించిన విద్యార్దులకు ప్రతి ఏటా 10 వేల నుండి 75 వేలు డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువు పూర్తి అయ్యేంత వరకు ఈ స్కాలర్షిప్ లు అందుతాయని, అన్నీ కులాలకు చెందిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8520860785, 9663517131అనే నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

Next Story