- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యాటక గైడ్‌ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..
తెలంగాణ పర్యాటక, పురావస్తు శాఖ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక గైడ్‌ల శిక్షణ కోసం అర్హులైన డిగ్రీ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక రంగం ప్రాముఖ్యతను వివరించేలా, పర్యాటక ప్రాంతాల్లో గైడ్‌లను నియమించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చారిత్రక, పురాతన, సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాలలో పర్యాటక గైడ్‌లుగా పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలకు సంబంధించి, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. చరిత్ర, ఆర్కియాలజీ, వారసత్వ కట్టడాలు, సంస్కృతి, కళలు, ఆర్కిటెక్చర్, పర్యాటక రంగాలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండాలి. భాషా నైపుణ్యం, చక్కగా మాట్లాడగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://docs.google.com/forms/d/e/1FAIpQLSdfLenWj-5csepK7CfawDDJEWC21PJaGbDjT8M0wsYS8k_9ww/viewform ద్వారా సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవచ్చు.






