- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పోటీలకు ధరఖాస్తులు ఆహ్వానం
రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఆగస్టులో హైదరాబాద్‌లో టూరిజం కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ఈ

టీజీటీడీసీ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పోటీలకు ధరఖాస్తులు ఆహ్వానం
-ఔత్సాహికుల నుంచి ఈ నెల 4 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ
-టూరిజం కాంక్లేవ్ నేపథ్యంలో పోటీల నిర్వహణ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఆగస్టులో హైదరాబాద్‌లో టూరిజం కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న సంస్కృతి, వారసత్వం, ప్రకృతి సౌందర్యం, చారిత్రక కట్టడాలు, పండుగలు, ఆహారం, పర్యాటక ఆకర్షణలను ప్రోత్సహించేలా తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీటీడీసీ) ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పోటీ లను నిర్వహిస్తోంది.
ఈ పోటీల్లో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల నుంచి జులై 4 నుంచి జులై 27 వరకు ధరఖాస్తులను స్వీకరించనున్నట్లు పర్యాటక శాఖ ఎండీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి వీడియోగ్రఫీ విభాగంలో మొదటి బహుమతికి పదివేలు, రెండవ బహుమతి రూ. 5 వేలు, మూడవ బహుమతి రూ. 3 వేల చొప్పున అందించనున్నారు.
అలాగే ఫోటోగ్రఫీ విభాగంలో మొదటి బహుమతి రూ. 4 వేలు, రెండవ బహుమతి రూ. 3 వేలు, మూడవ బహుమతి రూ. 2 వేలు అందించనున్నారు. ఫోటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ లో అప్‌లోడ్ చేసి, డ్రైవ్ లింక్ ను లింక్‌ను [email protected] కు పంపాలని టూరిజం ఎండీ సూచించారు. ఎంట్రీతో పాటు పాల్గొనేవారి పేరు, సంప్రదింపు వివరాలు, వర్గం, ఎంట్రీ శీర్షిక, తీసిన ప్రదేశం, తేదీని కూడా చేర్చాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://tourism.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.






