28 (2బి) బార్లకు దరఖాస్తుల ఆహ్వానం..

by Naga Rani Yarlagadda |

తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్ శాఖ 28 (2బి) బార్లకు దరఖాస్తుల ఆహ్వానానికి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బార్లకు, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, బోధన్‌, సరూర్‌నగర్‌ జల్‌పల్లి మునిసిపాలిటీల్లో ఒక్కొక్క 2బి బార్ల దరఖాస్తులకు నోటిఫికేషన్‌ జారీచేసింది.

28 (2బి) బార్లకు దరఖాస్తుల ఆహ్వానం..
X
  • మే 15 నుంచి జూన్‌ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బార్లు దరఖాస్తులకు ఆహ్వనం
  • తెలంగాణ ప్రొహిషిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్ శాఖ 28 (2బి) బార్లకు దరఖాస్తుల ఆహ్వానానికి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బార్లకు, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, బోధన్‌, సరూర్‌నగర్‌ జల్‌పల్లి మునిసిపాలిటీల్లో ఒక్కొక్క 2బి బార్ల దరఖాస్తులకు నోటిఫికేషన్‌ జారీచేసింది. నేటి నుంచి జూన్‌ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపింది. గతంలో 2బి బార్లకు పిలిచిన దరఖాస్తులతో బార్‌ లైసన్స్‌ పొంది లైసన్స్‌ పొంది ఫీజ్ లు చెల్లించకపోవడం, ఇతర కారణాలతో రద్దు చేయబడిన16 బార్లకు, 2బి బార్ల లైసన్స్‌లు పొంది 90 రోజుల్లో అవసరమైన డాక్యుమెంటేషన్, ఫీజులు చెల్లించకుండా బార్ల నిర్వహణకు ముందుకు రాని 12 బార్లను తిరిగి పునరుద్దారణ కోసం ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తులను ఆహ్వానించినట్లు పేర్కోంది. రూ.లక్ష డిపాజిట్ తో దరఖాస్తు స్వీకరించనున్నట్లు తెలిపింది. దరఖాస్తు రుసుము డి.డి.రూపంలో చెల్లించాలని, చెలించిన డబ్బు నాన్‌ రిఫండబుల్ గా ఎక్సైజ్ శాఖ నిర్థేశించినట్లు పేర్కొంది. డి.డి.లతో పాటు దరఖాస్తులను ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయం, హైదరాబాద్‌, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్‌ కార్యాలయాల్లోనూ, ఆయా ప్రాంతాల్లో దరఖాస్తులను అందించాల్సి ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు.

Next Story