టీజీఎస్‌‌ఆర్టీసీలో ఉద్యోగాలు.. 198 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. గడువు పొడిగింపు లేదు!

by Ramesh Naini |

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు.

టీజీఎస్‌‌ఆర్టీసీలో ఉద్యోగాలు.. 198 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. గడువు పొడిగింపు లేదు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. 2025 డిసెంబర్ 31న ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియకు జనవరి 20 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుందని పేర్కొన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు లేదు

జనవరి 20 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబడదని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సెలవుల దృష్ట్యా, అవసరమైన సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు పొందడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఖరి రోజుల్లో ట్రాఫిక్ పెరిగి సర్వర్ మొరాయించే అవకాశం ఉందని హెచ్చరించారు.

Next Story