Malka Komuraiah: చేతులు జోడించి అడుగుతున్నా.. ఉపాధ్యాయులకు బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి

by Prasad Jukanti |

బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యను గెలిపించాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు.

Malka Komuraiah:  చేతులు జోడించి అడుగుతున్నా.. ఉపాధ్యాయులకు బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో : విద్యావ్యవస్థలో మల్క కొమురయ్య (Malka Komuraiah) మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారని, ఉపాధ్యాయుల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి (Paidi Rakesh Reddy) అన్నారు. ఉపాధ్యాయులందరినీ చేతులు జోడించి అడుగుతున్నాను.. ఆదిలాబాద్ - కరీంనగర్ - నిజామాబాద్ - మెదక్ జిల్లాల బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్క కొమురయ్యను ఈసారి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Election) ప్రచారంలో భాగంగా ఇవాళ కొమరయ్య నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహ పత్రికను ఎమ్మెల్యేకు అందజేశారు. అలాగే ఎన్నికల ప్రచార సరళిపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మల్క కొమురయ్య కష్టపడే తత్వం కలవారని, కిందిస్థాయి నుంచి వచ్చారు కాబట్టి పేదవాళ్ల సమస్యలు ఎలా ఉంటాయో తనకు తెలుసని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలూ బీజేపీ (BJP) కైవసం చేసుకోబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.

Next Story