ఏపీపీ పరీక్షను తక్షణమే వాయిదా వేయాలి.. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్

by Kema Shiva Kumar |

సర్పంచ్ ఎన్నికల రోజున నిర్వహించ తలపెట్టిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను తక్షణమే వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.

ఏపీపీ పరీక్షను తక్షణమే వాయిదా వేయాలి.. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికల రోజున నిర్వహించ తలపెట్టిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను తక్షణమే వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఇవాళ హైకోర్టు సీనియర్ న్యాయవాది శివశేఖర్ (Shiva Shekar) ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించింది. డిసెంబర్ 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను వాయిదా వేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ అయింది. అయితే, అదే రోజు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుందని పేర్కొన్నారు. ఆ పరీక్షకు దాదాపు 4 వేల మంది న్యాయవాదులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్‌ (Hyderabad)లో, అభ్యర్థుల ఓట్లు వారి సొంత గ్రామాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజంతా పరీక్ష ఉండటంతో అభ్యర్థులు తమ గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధ్యమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉండాలన్నారు. పరీక్ష పేరుతో న్యాయవాదులను ఓటింగ్‌కు దూరం చేయడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి, డిసెంబర్ 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను మరో తేదీకి మార్చాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.రు.

Next Story