- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసిన AP మహిళ
by Gantepaka Srikanth |
తెలంగాణలో 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసిన ఏపీ మహిళ

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన లభించింది. ఎక్సైజ్(Telangana Excise Department) కమిషనర్ కార్యాలయంలో శనివారం చివరి రోజు కావడంతో మహిళా దరఖాస్తుదారులు సందడి చేశారు. నిన్నటి వరకు 50 వేల దరఖాస్తులు రాగా.. ఈ రోజు మరో 20 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలు చెల్లించారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం రూ.4 కోట్ల 50 లక్షలు చెల్లించింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈనెల 23న మద్యం దుకాణాలకు డ్రా తీయనున్నారు. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story






