- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP: ఏపీలో రాజకీయ పార్టీలపై మావోయిస్టు గణేష్ లేఖ.. పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఆయా పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను కూడా విడుదల చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు కీలక నేత గణేష్ ఏపీలోని రాజకీయ పార్టీలపై స్పందిస్తూ లేఖాస్త్రాన్ని సంధించారు. ముఖ్యంగా ఆయన సినీ హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అంటూ పవన్ చెప్పుకొచ్చాడని అన్నారు. కానీ, అతడు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయ చేస్తున్నాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదని.. అతడికి విశ్వసనీయత తక్కువ అని అన్నారు. సినీ గ్లామర్, కాపు కలస్థుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిందని మావోయిస్టు గణేష్ అన్నారు.
Advertisement
Next Story