TG: ఓట్ల లెక్కింపును పరిశీలించిన ఏపీ ఎన్నికల కమిషనర్

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సహాని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.

TG: ఓట్ల లెక్కింపును పరిశీలించిన ఏపీ ఎన్నికల కమిషనర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సహాని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఓట్ల లెక్కింపు అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్‌లతో కలిసి శుక్రవారం సహాని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, మేయర్, డిప్యూటీ మేయర్/చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ముఖ్యంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యల గురించి సహాని చర్చించారు. దీంతోపాటు 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు బందోబస్తు, శాంతి భద్రతల నిర్వహణపై రాణికుముదిని, అడిషల్ డీజీపీ మహేష్ భగవత్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ చర్చల్లో ఎన్నికల పరిశీలకులు మకరంద్, ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యానాయక్, తెలంగాణ మున్సిపల్ శాఖ మాజీ కమిషనర్ సత్యనారాయణ, ఎన్నికల సంఘం అధికారులు ఉన్నారు.

Next Story