Tg: మళ్లీ రంగంలోకి చంద్రబాబు..ఈసారి పక్కా ప్లానింగ్..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-16 12:13:08  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Ap Cm Chandrababu Naidu) మరోసారి రాజకీయ చాణిక్యానికి మరోసారి పదును పెట్టనున్నారు..

Tg: మళ్లీ రంగంలోకి చంద్రబాబు..ఈసారి పక్కా ప్లానింగ్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Ap Cm Chandrababu Naidu) మరోసారి రాజకీయ చాణిక్యానికి మరోసారి పదును పెట్టనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకున్న బిరుదు అపర చాణుక్యుడు. హీటెక్కిన పొలిటికల్ రాజ్యంలో కూడా మొత్తం గేమ్ ఛేంజ్ గల సత్తా ఉందనే వాళ్లు. విభజనకు ముందు రాష్ట్రంలో కింద స్థాయిలో కేడర్ బలంగా ఉన్న పార్టీ కూడా టీడీపీ‌నే అని చెప్పుకునేవాళ్లు. అంతటి చాణిక్యత ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ(Telangana)లో 15 సీట్లు సాధించింది. అయితే ఆ తర్వాత పార్టీ చెప్పుకోదగ్గట్టుగా ఉన్నా తెలంగాణలో జరిగిన ఊహించని పరిణామంతో పార్టీ నాయకులంతా ఇతర పార్టీలోకి వెళ్లారు. మరీ ముఖ్యంగా పార్టీలోని మెజార్టీ నాయకులంతా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీ పూర్తిగా పలుచబడింది. తెలంగాణలో నేతలు లేని పార్టీగా తెలుగుదేశం పార్టీ పేరు తెచ్చుకుంది. అయితే కేడర్ మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం రాజకీయాల్లో స్తబ్ధుగా ఉన్నారు. కానీ అప్పుడప్పడు తమ పార్టీ ఇంకా ఉందనే సంకేతలిస్తూనే ఉన్నారు. 2023 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. టీడీపీ(Tdp) కార్యకర్తల మద్దతు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి. కానీ ఎవరికీ మద్దతు తెలపకుండా మౌనంగా ఓటు వేశారు.

మళ్లీ చురుగ్గా...


అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అధికారంలోకి రావడంతో మళ్లీ చురుగ్గా పని చేసేందుకు రెడీ ఉన్నారు. అటు అధినేత చంద్రబాబు కూడా తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇందులో తన టీమ్‌లోకి రంగంలోకి దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు ఇదే కరెక్ట్ సమయం అని భావిస్తు్న్నారట. ఇందుకోసం ముందుగా స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దింపబోతున్నారట. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ఎన్నికల్లో కూటమి కోసం పని చేసిన ‘షోటైం’ సంస్థను ఇక్కడ కూడా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఈ సంస్థ ద్వారా పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేసేందుకు అటు చంద్రబాబు సైతం సిద్ధంగా ఉన్నారట. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల చాలా సమయం ఉండటంతో ముందుగా పార్టీ పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారట. దీంతో రాష్ట్రంలో టీడీపీకున్న ఓట్ షేర్, గతంలో టీడీపీ బలంగా నియోజకవర్గాలు, జిల్లాల లిస్టు రెడీ చేస్తున్నారట. అంతేకాదు ఆపరేషన్ ఆకర్ష్ కూడా చేపట్టాలని అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు బాబు మోహన్, చామకూర మల్లారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలోకి వచ్చే నాయకులపై ‘షో టైం’ సంస్థ ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇదే గాని జరిగితే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ పునర్వైభవం కచ్చితంగా వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Next Story