AP Cabinet : 28న ఏపీ కేబినెట్ భేటీ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-22 10:48:44  IST  )

ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting) ఈ నెల 28న జరుగనుంది.

AP Cabinet : 28న ఏపీ కేబినెట్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting) ఈ నెల 28న జరుగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో 2025-2026 వార్షిక బడ్జెట్(Annual Budget) ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్నారు. అలాగే శాసనసభబడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాగే వివిధ పాలనా సంబంధిత అంశాలపైనా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపైనా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

వీటితోపాటు త్వరలో రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశాల నుంచి ప్రారంభించనున్న సంక్షేమ పథకాలపైనా కేబినెట్‌లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మంత్రివర్గ సమావేశంలోనే మరిన్ని ఇతర కీలక అంశాలపైనా సీఎం, మంత్రులు చర్చించనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఏపీ కేబినెట్ భేటీ ఫిబ్రవరి 20 వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సి ఉంది. అయితే అదే రోజు.. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో 28వ తేదీకి వాయిదా పడింది.

Next Story