- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అదో దగాకోరు పార్టీ’.. బీఆర్ఎస్‌పై ఏపీ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాలు(Telangana Politics), బీఆర్ఎస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్(Madhav) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాలు(Telangana Politics), బీఆర్ఎస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్(Madhav) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతోయ మాట్లాడుతూ.. తెలంగాణ సెంటిమెంట్‌ను బీఆర్ఎస్ పార్టీ(BRS Party) దుర్వినియోగం చేసిందని అన్నారు. పంపకాల్లో తేడాలు రావడం వల్లే నేడు ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అవినీతిమయమైన ఏ పార్టీ అయినా చివరకు ఈ స్థితి రావాల్సిందే అన్నారు. తెలుగు రాజకీయాల్లో బీఆర్ఎస్ ఓ దగాకోరు పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. పార్టీకి నష్టం కలిగిస్తోందంటూ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత(Kavitha) తన ఎమ్మెల్సీ పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇవాళ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై పోరాడటం, కేసీఆర్(KCR) స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయన్న ఆమె.. ఇలా ఒక్కసారిగా సస్పెండ్ చేయటం బాధ కలిగించిందన్నారు.






