- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెలిమెట్రీ ఏర్పాటుకు ఏపీ అంగీకారం : ఉత్తమ్
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై చర్చించేందుకు నేడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై చర్చించేందుకు నేడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్న పలు కీలక వివాదాలు ఓ కొలిక్కి వచ్చాయని పేర్కొన్నారు. కృష్ణా జలాల వాడకంపై టెలిమెట్రీ(Telemetry) ఏర్పాటుకు ఏపీ అంగీకారం తెలిపిందని అన్నారు. అలాగే కృష్ణా వాటర్ బోర్డును ఏపీలో ఏర్పాటు చేయాలని, గోదావరి వాటర్ బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు వెల్లడించారు.
ఇరు రాష్ట్రాల నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు వెంటనే చర్యలు చేపడతామని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు వంటి తదితర అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.






