KRMB : కేఆర్ఎంబీ భేటీకి ఏపీ డుమ్మా.. రాహుల్ బొజ్జా ఆగ్రహం

by Muthe.Rajitha |

కేఆర్ఎంబీ భేటీకి ఏపీ గైర్హాజరు కావడంపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

KRMB : కేఆర్ఎంబీ భేటీకి ఏపీ డుమ్మా.. రాహుల్ బొజ్జా ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : కేఆర్ఎంబీ భేటీకి ఏపీ గైర్హాజరు కావడంపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీపై ఏపీకి కనీస గౌరవం లేదా అంటూ ప్రశ్నించింది. 23 టీఎంసీలకు గత భేటీలో ఏపీ ఒప్పుకొని ఇప్పుడు సమావేశానికి రాకపోవడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో బుధవారం జలసౌధలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) అనిల్ కుమార్ హాజరయ్యారు. అయితే.. ఈ సమావేశానికి రావాల్సిన ఏపీ అధికారులు హాజరుకాలేదు. దీంతో గురువారం మరోమారు భేటీ అయ్యేందుకు కేఆర్ఎంబీ చైర్మన్ నిర్ణయించారు. అయితే.. నేటి సమావేశానికి సైతం ఏపీ అధికారులు హాజరు అవుతారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. ఏపీ గైర్హాజరు కావడంపై రాహుల్ బొజ్జా స్పందిస్తూ.. ఏపీ అధికారులు కావాలనే సమావేశానికి రాలేదని ఫైర్ అయ్యారు.

గురువారం మరోసారి భేటీ

నీటి పారుదల శాఖ నల్లగొండ సీఈ, ఏపీ జలవనరుల శాఖ ఒంగోలు సీఈలు.. శ్రీశైలం, సాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించుకోవాలని చైర్మన్ సూచించారు. ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించి ఏదో ఒక నిర్ణయానికి రావాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల అధికారులు ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి ఈ నెల 25లోగా సమర్పించాలని బోర్డు ఆదేశించింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండనున్న సాగునీరు, జూలై 31 వరకు తాగునీటి అవసరాల వివరాలు ఈ ప్రణాళికలో ఉండాలని ఆదేశించింది. ఆ ప్రణాళిక ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని కేఆర్ఎంబీ చైర్మన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. కానీ.. ఏపీ అధికారులు రాకపోవడంతో నేడు మరోమారు వారిని సమావేశానికి ఆహ్వానించారు.

Next Story