- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Praveen Kumar : తెలంగాణలో 'ఎనుము-చట్టం : ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana)లో ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన(No Democracy) లేదని..ఏక వ్యక్తి నియంతృత్వ ఓలిగార్కీ(Oligarchy) పాలన సాగుతోందని బీఆర్ఎస్(Brs) నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ (R.S. Praveen Kumar)ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని. ఇక్కడ 'ఎనుము-చట్టం(Anumu-law) మాత్రమే వర్తిస్తుందని..రాజకీయ ప్రత్యర్థులపై మాత్రమే అమలు చేయబడుతుందని విమర్శించారు. ఇందుకు మరో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పెట్టిన ఈడీ కార్యాలయం ముందు..రాజ్ భవన్ ముందు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి(Anumula Revanth Reddy) నిర్వహించిన ధర్నాల ట్వీట్ ను ఆయన ప్రస్తావించారు.
సీఎం ఎక్కడైన ధర్నాలు చేసినా కేసుల్లేవని..ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్(Ktr) విచారణ అనంతరం ఏసీబీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళితే అనుమతి లేని ర్యాలీ అంటూ కేసులు పెట్టడం ఏమిటని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వేసిన ప్రతి తప్పుడు కేసులకు, నిరంకుశ, అన్యాయ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధమైన పోరాటాన్ని చేస్తుందన్నారు.
హోస్నీ ముబారక్ (ఈజిప్ట్), నికోలాయ్ సియోసెస్కు (రొమేనియా), బషర్ అల్ అస్సాద్ (సిరియా), మహీంద్ర రాజపక్సే (శ్రీలంక), బెన్ అలీ (ట్యునీషియా), షేక్ హసీనా (బంగ్లాదేశ్) అందరూ ఇలాంటి వ్యూహాలను ఆశ్రయించారని..చరిత్ర వారికి తమ స్థానాన్ని చూపించిందన్నారు...తెలంగాణలో అందరూ అంతా గమనిస్తున్నారని తగిన సమయంలో గుణపాఠం చెబుతారని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.






