అమీర్‌పేట్‌ గర్ల్స్ హాస్టల్‌లో అసాంఘిక కార్యకలాపాలు.. యవతి షాకింగ్ వీడియో!

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-21 07:04:46  IST  )

అమీర్‌పేట్‌లోని ఓ గర్ల్స్ హాస్టల్‌లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఓ యవతి వీడియో రిలీజ్ చేయడం షాకింగ్ గా మారింది. లేడీస్ హాస్ట‌ల్ ముసుగులో త‌ప్పుడు ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించింది.

అమీర్‌పేట్‌ గర్ల్స్ హాస్టల్‌లో అసాంఘిక కార్యకలాపాలు.. యవతి షాకింగ్ వీడియో!
X

దిశ‌, వెబ్ డెస్క్: అమీర్‌పేట్‌లోని ఓ గర్ల్స్ హాస్టల్‌లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఓ యవతి వీడియో రిలీజ్ చేయడం షాకింగ్ గా మారింది. లేడీస్ హాస్ట‌ల్ ముసుగులో త‌ప్పుడు ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించింది. తాను గ‌తేడాది నెల రోజులు ఉండేందుకు ఆ పీజీలో చేరాన‌ని కానీ ప‌దిహేను రోజుల్లోనే అక్క‌డి నుండి వెళ్లిపోయిన‌ట్టు తెలిపింది. పీజీలో వ‌స‌తులు స‌రిగ్గా లేవ‌ని, ఆహారం కూడా స‌రిగ్గా పెట్ట‌రు అని ఆరోపించింది. అంతే కాకుండా హాస్ట‌ల్ గదిలోకి ఓన‌ర్ త‌ర‌చూ వ‌స్తుంటాడ‌ని, అమ్మాయిల రూంలోకి రావ‌డం ఏంటి అంటే ఇక్క‌డ ఇలానే ఉంటుంది ఉంటే ఉండు పోతే పో అంటూ హెచ్చ‌రించార‌ని చెప్పింది. ఓన‌ర్ కూడా త‌న ఫోన్ నంబ‌ర్ అడిగాడ‌ని ఆరోపించింది. అంతే కాకుండా ఆ హాస్ట‌ల్ లో అమ్మాయిల‌ను అబ్బాయిల‌కు స‌ప్లై చేస్తారు అని చెప్పేవారు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆ హాస్ట‌ల్ నిర్వ‌హకుల‌పై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.

Next Story