వరంగల్‌లో మరో యువతి ఆత్మహత్య.. కారణమిదే!

by GSrikanth |

వరంగల్ జిల్లాలో వరుస విషాదాలు చోటుచేసుకుంది. నిన్న ప్రీతి, నేడు రక్షిత ఆత్మహత్యల ఘటనలు మరువకముందే జిల్లాలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

వరంగల్‌లో మరో యువతి ఆత్మహత్య.. కారణమిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాలో వరుస విషాదాలు చోటుచేసుకుంది. నిన్న ప్రీతి, నేడు రక్షిత ఆత్మహత్యల ఘటనలు మరువకముందే జిల్లాలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. యువకుడు ప్రేమించి మోసం చేశాడని జిల్లాలోని ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌కు చెందిన ఉషారాణి అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. హుజురాబాద్‌లోని ప్రయివేటు కాలేజీలో ఒకేషనల్ కోర్సు చేస్తున్న ఉషారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story