నన్ను క్షమించండి.. గాంధీలో బీపీ మిషన్ దొంగిలంచిన యువకుడు మరో వీడియో

by Ajay Maddhiboyina |

గాంధీలో ఓ ఆకతాయి బీపీ మిషన్ దొంగలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రాత్రి 3 గంటల సమయంలో గాంధీ ఆస్పత్రిలో బీపీ మిషన్ చోరీ చేసిన యువకుడు..

నన్ను క్షమించండి.. గాంధీలో బీపీ మిషన్ దొంగిలంచిన యువకుడు మరో వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: గాంధీలో ఓ ఆకతాయి బీపీ మిషన్ దొంగలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రాత్రి 3 గంటల సమయంలో గాంధీ ఆస్పత్రిలో బీపీ మిషన్ చోరీ చేసిన యువకుడు.. బీపీ చెక్ చేయమంటే చేయలేదని అందుకే మిషన్ ఎత్తుకెళుతున్నానని రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో అతడు క్షమాపణలు చెబుతూ మరో వీడియోను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గాంధీ ఆస్పత్రిలో తమ పిన్నిని అడ్మిట్ చేశామని చెప్పారు. బీపీ మిషన్ దొంగలిస్తూ, డాక్టర్లను దూషించి తప్పు చేశానని తనను క్షమించాలని అన్నాడు. గాంధీలో ట్రీట్మెంట్ బాగుందని, తమ పిన్నికి ట్రీట్మెంట్ చేసి క్షేమంగా ఇంటికి పంపించారని చెప్పాడు. డాక్టర్లే తమ పిన్నిని క్షేమంగా ఇంటికి పంపించారని అన్నాడు. తాను రీల్ చేసి తప్పు చేశానని అన్నాడు. ఎవరూ ఇలాంటివి చేయవద్దని, ఇది క్రైమ్ కిందకు వస్తుందని అన్నాడు.

Next Story