- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో అప్‌డేట్.. ‘ఆరా’ మస్తాన్‌కు SIT పిలుపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కీలక నిందితుడు ప్రభాకర్ రావుతో సహా రాధాకిషన్ రావు, భుజంగ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్నలను సీపీ సజ్జనార్ నేతృత్వంలోని SIT సమగ్రంగా విచారించి కీలక సమాచారాన్ని సేకరించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కీలక నిందితుడు ప్రభాకర్ రావుతో సహా రాధాకిషన్ రావు, భుజంగ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్నలను సీపీ సజ్జనార్ నేతృత్వంలోని SIT సమగ్రంగా విచారించి కీలక సమాచారాన్ని సేకరించింది. అయితే, తాజాగా ఇదే కేసులో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ (AARAA) పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు షేక్ మస్తాన్‌కు SIT విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మస్తాన్ కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌కు గురైన జాబితాలో సెఫాలజిస్ట్ ‘ఆరా’ మస్తాన్ పేరు కూడా ఉంది. ఈ మేరకు SIT ఆయనను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సిద్ధమైంది.
కాగా, అక్రమ ఫోన్ ట్యాపింగ్ స్కాండల్‌లో ట్యాపింగ్‌కు గురైన బాధితులలో చాలామందిని SIT ఇప్పటికే విచారించింది. అందులో ఎంపీలు, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండీ, గోనె ప్రకాశ్, తదితరులు ఉన్నారు. సుమారు 600 నుంచి 6 వేల వరకు ఫోన్ నంబర్లు ట్యాప్ చేసినట్లుగా విచారణలో తేలింది. అందుకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, పూర్తి వివరాలతో ఉన్న పెన్ డ్రైవ్ డేటాను SIT రిట్రీవ్ చేసింది.
Read More..
ముగిసిన కస్టోడియల్ విచారణ.. జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి ప్రభాకర్ రావు రిలీజ్






