- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ మరో అనూహ్య నిర్ణయం
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకుంది.

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకుంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అవకతవకలపై న్యాయ విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రేవంత్ సర్కార్ మరోసారి పొడిగించింది. జూలై 31 వరకు విచారణ గడువు పెంచుతూ ఇవాళ గవర్నమెంట్ జీఓ జారీ చేసింది. ఇందుకు గల కారణాలను ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కొవిడ్ మహమ్మారి మరోసారి చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. హాంగ్‌కాంగ్, సింగపూర్‌లలో కొన్ని రోజులుగా కొవిడ్‌తో ఆస్పత్రి బాట పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా.. తాజాగా ఇండియాలోకి మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
గుంటూరు కలెక్టరేట్ వద్ద ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. బుజ్జి అనే మహిళ ఈ ఉదయం కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లారు. తన స్థలాన్ని ఆక్రమించారని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు గతంలోనూ ఫిర్యాదు చేశారు. ఇవాళ కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అధికారులు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెంది పురుగులు మందు తాగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
భారత్‌లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత దేశం ధర్మ సత్రం కాదని, శరణార్థులకు ఇక్కడ స్థానం లేదని.. తక్షణమే దేశాన్ని వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇప్పటికే దేశంలో జనాభా 140 కోట్లకు పెరిగిందని.. ఈ జనాభాతోనే తాము సతమతమవుతున్నామని పేర్కొంది. విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమీ ధర్మసత్రం కాదు.. వేరే ఏ దేశానికైనా వెళ్లిపోండి అని సూచనలు చేసింది. సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ అయిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






