- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. సిట్ విచారణకు నందకుమార్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. సిట్ విచారణకు నందకుమార్

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్(Nandakumar) సిట్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలోనే నందకుమార్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనే సిట్ అధికారులు నందకుమార్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే.. కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసిందని.. దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నందకుమార్ గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు? ఎక్కడ చేశారు? అనే పూర్తి వివరాలను అప్పటి డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరారు. తాజాగా ఆయన విచారణకు హాజరు కావడం కలకలం రేపుతోంది.
మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీస్ జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావునూ విచారించే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తునకు లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలంటే వీరిద్దరినీ విచారించాల్సిన అవసరముందని భావిస్తున్నట్లు సమాచారం. శాసనసభ సమావేశాల అనంతరం సమన్లు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.






