గాదె ఇన్నయ్య కుటుంబంలో మరో విషాదం.. తండ్రి సాల్మోన్ రెడ్డి కన్నుమూత

by Kema Shiva Kumar |

గాదె ఇన్నయ్య తండ్రి సాల్మోన్ రెడ్డి ఇవాళ ఉదయం కన్నుమూశారు. తల్లి మరణించిన కొద్ది రోజులకే తండ్రి కూడా మరణించడంతో ఇన్నయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

గాదె ఇన్నయ్య కుటుంబంలో మరో విషాదం.. తండ్రి సాల్మోన్ రెడ్డి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సామాజిక కార్యకర్త, పౌర హక్కుల నేత గాదె ఇన్నయ్య (Gade Innaiah) కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆయన తల్లి మరణించగా, ఇవాళ ఉదయం ఆయన తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి (Salmon Reddy) కన్నుమూశారు. గాదె ఇన్నయ్య ప్రస్తుతం మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నమోదు చేసిన కేసులో రిమాండ్‌లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన తల్లి మరణించిన సమయంలో, కోర్టు అనుమతితో పెరోల్‌పై వచ్చి ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తల్లిని కోల్పోయిన దుఃఖం నుంచి తేరుకోకముందే, ఇప్పుడు తండ్రి సాల్మోన్ రెడ్డి మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

అయితే, సాల్మోన్ రెడ్డి మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు, ఆత్మీయులు వారి నివాసానికి చేరుకుంటున్నారు. వీలైతే శ్రేయోభిలాషులు, సన్నిహితులు అంత్యక్రియలకు హాజరుకావాలని కుటుంబ సభ్యులు కోరారు. తండ్రి అంత్యక్రియల నిమిత్తం ఇన్నయ్య మరోసారి పెరోల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం.

Next Story