- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫాల్కన్ స్కామ్ కేసు.. పోలీసుల అదుపులో మరో నిందితుడు
క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ స్కామ్ లో మరో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐడీ ఏడీజీపి చారుసిన్హా తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ స్కామ్ లో మరో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐడీ ఏడీజీపి చారుసిన్హా తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో బటిండాలో అరెస్టు చేసినట్లు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. అరెస్ట్ కాబడిన వ్యక్తి ఫాల్కన్ స్కామ్ కేసులో ఏ 5 నిందితుడుగా పేర్కొన్నారని ఆర్యన్ సింగ్ ఛబ్రాగా తెలిపారు. ఫాల్కన్ ఇన్‌వాయిసింగ్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్( సీఓఓ)గా వ్యవహరించాడు. శుక్రవారం పంజాబ్ లో అరెస్ట్ చేసి ట్రాన్సింట్ వారెంట్‌లో ఆదివారం హైదరాబాద్ తీసుకువచ్చినట్లు తెలిపారు. రిమాండ్ తరలించేందుకు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచినట్లు వెల్లడించారు. ఆర్యన్ సింగ్ కంపెనీ తరపున బాధితుల నుంచి రూ.14.35కోట్లు డిపాజిట్లను సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
ఆర్యన్ సింగ్ రూ.1.62 కోట్లు మొత్తాన్ని తన ఖాతాకు మళ్లించినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఫాల్కన్ స్కామ్ కేసు నమోదు కాగానే అతను నాందేడ్‌కు పారిపోయాడని , అక్కడి నుండి పంజాబ్‌లోని బటిండాకు పారిపోయి గురుద్వారాలో ఆశ్రయం పొందినట్లు విచారణలో వెల్లడైనట్లు వివరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర సీఐడీ ప్రత్యేక బృందం పంజాబ్‌లోని బటిండాకు వెళ్లి అతన్ని పట్టుకుందని తెలిపారు. అతని వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఆర్యన్ సింగ్‌తో పాటు, ఇప్పటివరకు 09 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితులందరినీ అరెస్టు చేయడానికి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ పేరుతో నకిలీ ఒప్పందాలను సృష్టించి , అధిక వడ్డీ రేట్లతో డిపాజిటర్లను ప్రలోభపెట్టి 7056 డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లు వసూలు చేశారని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 4065 మంది బాధితుల నుంచి రూ.792 కోట్లు మోసాలకు పాల్పడ్డారని తెలిపారు.
- Tags
- Falcon Company






