రాహుల్‌గాంధీతో పాటు మెస్సీ మ్యాచ్‌కు మరో సర్‌ప్రైజ్ గెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-13 06:01:51  IST  )

రాహుల్‌గాంధీతో పాటు మెస్సీ మ్యాచ్‌కు మరో సర్‌ప్రైజ్ గెస్ట్

రాహుల్‌గాంధీతో పాటు మెస్సీ మ్యాచ్‌కు మరో సర్‌ప్రైజ్ గెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ సందడి మొదలైంది. ఎవరి నోట విన్నా మెస్సీ పేరే వినిపిస్తున్నది. సాకర్ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న మెస్సీ(Lionel Messi) నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉప్పల్‌లో స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. దీంతో అతడి ఆటను చూసేందుకు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌లో మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి సైతం ఆడనుండటంతో మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ గేమ్‌కు సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మరోవైపు మెస్సీ, రేవంత్ రెడ్డి‌(CM Revanth Reddy)ల గేమ్‌ను చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హైదరాబాద్ వస్తున్నారు. మేనల్లుడి(ప్రియాంక గాంధీ కొడుకు)తో రాహుల్ హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో ఇటు క్రీడాకారులు, ఆటు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story