- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ఐటీ రంగంలో మరో ముందడుగు
హైదరాబాద్‌లో ఓజ్రిట్ తన నూతన కార్యలయాన్ని ప్రారంభించుకోవడం ఐటీ రంగంలో ఇది మరో ముందడుగు అని రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు....

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో ఓజ్రిట్ తన నూతన కార్యలయాన్ని ప్రారంభించుకోవడం ఐటీ రంగంలో ఇది మరో ముందడుగు అని రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ ఓజ్రిట్ తన నూతన కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాలయాన్ని కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ నూతన లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఓజ్రిట్ బృందంతో ఆయన ముచ్చటించారు. సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో భరత్ గుప్తా, కో ఫౌండర్ అండ్ సీఓఓ వివేకానందరెడ్డి తదితర నాయకత్వ బృందంతో ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించారు. తెలంగాణను భారతదేశంలోనే అగ్రగామి టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో కేటీఆర్ చేసిన అలుపెరగని కృషిని, ఆయన దార్శనికతను ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ప్రత్యేకంగా కొనియాడారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. కేటీఆర్ ప్రోత్సాహం, ఆయన సాంకేతిక ఆధారిత అభివృద్ధి లక్ష్యాల స్ఫూర్తితోనే ఓజ్రిట్ స్థాపించబడిందన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు సృష్టించడం, టైర్-2 (ద్వితీయ శ్రేణి) నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో తమ ఉద్యోగుల సంఖ్యను 1,000 మందికి పైగా పెంచుతామని చెప్పారు. ఈ ఐటీ ఎకో సిస్టమ్‌కు తమ వంతు సహకారం అందించడానికి తాము పూర్తి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.






