RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో షాక్

by Gantepaka Srikanth |
RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు మరో షాక్ తగిలింది. హైకోర్టు(Telangana High Court)లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మంగళవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వుల జారీ చేసింది. అంతేకాదు.. శుక్రవారం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేసింది. కాగా, సోషల్ మీడియా పోస్టులపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. విచారణకు రావాలని అనేకసార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కొన్నాళ్లుగా చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story