కల్వకుంట్ల కవిత మరో సంచలన ట్వీట్

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ పెట్టారు.

కల్వకుంట్ల కవిత మరో సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ పెట్టారు. ‘‘నిజం మాట్లాడటానికి ఖర్చైతే, తెలంగాణ ప్రజల కోసం నేను మళ్ళీ వంద రెట్లు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చివరలో ‘సత్యమేవ జయతే.. జై తెలంగాణ’ అని రాసుకొచ్చారు. కాగా, ఇవాళ ఉదయం బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటం, కేసీఆర్(KCR) స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయన్న ఆమె.. ఇలా ఒక్కసారిగా సస్పెండ్ చేయటం బాధ కలిగించిందన్నారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా నిజం మాట్లాడటానికి తాను ఎప్పుడూ వెనుకాడబోనని ప్రకటన చేశారు.

Next Story