- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా మంత్రి పదవిని వాళ్లు అడ్డుకున్నారు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మరో సంచలన ట్వీట్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy)కి మంత్రి పదవి హామీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి (Minister position) ఇస్తామంటూ హామీ ఇచ్చిన మాట నిజమేనని ఆదివారం ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. భట్టి చేసిన వ్యాఖ్యలపై తాాజాగా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా మరో సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు.. అని పేర్కొన్నారు.
నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు.. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను (Congress) కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశించారు. కాగా, గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ పెరినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం కష్టమని హైకమాండ్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.






