- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ కొడుకు కాబట్టి కేటీఆర్ ను సీఎం చేయాలా? : కవితక్క పేరుతో మరో సంచలన పోస్ట్
బీఆర్ఎస్ పార్టీలో రోజులకో సంచలనం నమోదవుతున్నది. ఇప్పటికే ఆ పార్టీకి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడంతో ఈ హీట్ పెరిగిపోయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో రోజులకో సంచలనం నమోదవుతున్నది. ఇప్పటికే ఆ పార్టీకి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడంతో ఈ హీట్ పెరిగిపోయింది. అయితే.. బీఆర్ఎస్‌లోని కీలక నేతల మీద సోషల్ మీడియాలో కవిత మద్దతుదారుల దాడి కొనసాగుతూనే ఉన్నది. కీలక నేతలపై రోజుకో లీక్ ఇస్తూ సంచలనాలకు తెరదీస్తున్నారు. తాజాగా మరో సంచలన విషయాన్ని ‘కవితక్క అప్‌డేట్స్’ పేరిట ఉన్న ‘ఎక్స్’ఖాతాలో పోస్టు చేశారు. గురువారం సంతోష్‌రావుపై అవినీతి ఆరోపణలు అంటూ లీక్స్ ఇవ్వగా.. శుక్రవారం గతంలో బీఆర్ఎస్ నేతల హంపీ టూర్‌పై కీలక విషయాలు వెల్లడించారు.
అయితే.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంలోనే కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హంపీ టూర్‌ను ప్రస్తావిస్తూ హరీశ్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘హంపీలో కమలాన్ని మొలకెత్తించాలని అనుకున్న కారు ఓనర్లు’ పేరుతో సంచలన ఆరోపణలు చేశారు. నేరుగా నేతల పేర్లు ప్రస్తావించకుండా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.
కేటీఆర్‌ను ఒప్పుకోం..
రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు ఇస్తున్న పార్టీ అని చెప్పి కొంత మంది గులాబీ నాయకులు హంపీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భం వేరే అయినా.. వారు మాట్లాడుకున్నది వేరు అని ‘కవితక్క అప్‌డేట్స్’ పేరిట ఉన్న ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు. ‘కేసీఆర్ తర్వాత కేటీఆర్‌ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము. పార్టీకి ఓనర్లం మేమే. కేసీఆర్ కొడుకు కాబట్టి అతడిని సీఎం చేయాలా?’ అని కొంత మంది నేతలు చెప్పారని.. ఈ సందర్భంగా పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పాటలు కూడా పాడారని రాసుకొచ్చారు. ఆ తర్వాత పార్టీలో జరిగిన కీలక విషయాలను పోస్టులో వివరించారు.
కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవాలని..
‘కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవాలి అని, కార్ ఓనర్‌ను బలిచ్చిన మచ్చ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, నల్గొండకు చెందిన ఒక ముఖ్య కారు నాయకుడి పార్టీ అని చెప్పి, కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భం వేరే అయినా, కేసీఆర్ తరువాత కేటీఆర్‌ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము, పార్టీకి ఓనర్లమేము. కేటీఆర్ కొడుకు కాబట్టి అతడిని సీఎం చేయాలా? అని కొంతమంది రసవత్తరంగా చెప్పారు. పార్టీకి, కేసీఆర్‌కి వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. అగ్గిపెట్ట మచ్చ, పార్టీ ఓనర్, ఇతర నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టాలి అని మొదట అనుకున్నా, అది సాధ్యమవుతుందో లేదో అనుమానంతో కమలం పార్టీలోకి వెళ్లాలని ఆ నాయకులు భావించారు.
అయితే.. ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తెలియవు అనుకోవడం వారి తెలివితక్కువతనం. ఈ విషయాలు అన్నీ పూసగుచ్చినట్లు కేసీఆర్‌కి తెలిసినవి. అప్పుడు మెల్లగా మన మచ్చ, కేటీఆర్ దగ్గరకు వచ్చి ‘నేను మీ వెంటనే ఉంటా, ఎక్కడికీ వెళ్లను. నువ్వే ఏదైనా చేసి ఒప్పించాలి. నేను ఏం చేయలేదు. మొత్తం పార్టీ ఓనర్ చేశాడు’ అని చెప్పారు. పాపం పార్టీ ఓనర్‌ను తన స్వార్థం కోసం బలిచేశాడు. ఇలాగే చెప్పితే నమ్ముతారో లేదో అని, తన వద్దకు వచ్చిన ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఇచ్చాడు. తనకు మంత్రి పదవి ఇచ్చినా, కేవలం అమలు చేయడం వరకే పరిమితం చేశారు. ఎక్కడ ఎంతవరకు ఉంచాలో, అక్కడ వరకే ఉంచారు కేసీఆర్. ఇప్పుడు మళ్లీ బీజేపీకి వెళ్తున్నాడని వార్తలు రప్పించుకొని, బ్లాక్‌మెయిల్ చేసి పార్టీలో నంబర్ 3 స్థానం దక్కించుకున్నాడు.
కానీ.. అతని దాహం అక్కడితో ఆగలేదు. కేసీఆర్‌కంటే తానే గొప్ప అని, ఒక మేధావి కొంతమంది కూలీలతో చెప్పించుకుంటున్నాడు. ఈ సమావేశంలో నల్గొండకు చెందిన అప్పటి కొంతమంది ఎమ్మెల్యేలు, చంటి, రసమలై, పార్టీ ఓనర్.. తదితరులు ఉన్నారు. వాళ్ల పేర్లు సందర్భం వచ్చినప్పుడు బయట పెడతాం’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే.. ఆ ట్వీట్‌లో పేర్కొన్నట్లు హంపీలో కలుసుకున్నది మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికుమార్, రసమయ బాలకిషన్ అని ప్రచారం జరుగుతున్నది.






