- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రాష్ట్రంలో మరో సంచలనం.. రైతు ఫిర్యాదుపై HRC సీరియస్?
తెలంగాణ రైతాంగాన్ని యూరియా కొరత వేధిస్తోంది. విస్తారంగా వర్షాలు పడుతోన్న వేళ అన్నదాతలు యూరియా కోసం అన్ని పనులను వదిలేసి పీఏసీఎస్ (PACS)ల ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతాంగాన్ని యూరియా కొరత వేధిస్తోంది. విస్తారంగా వర్షాలు పడుతోన్న వేళ అన్నదాతలు యూరియా కోసం అన్ని పనులను వదిలేసి పీఏసీఎస్ (PACS)ల ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. కొన్నిచోట్ల క్యూలైన్లలో రైతులు నిలబడలేక చెప్పులను తమ స్థానాల్లో పెట్టి చెట్ల కింద సేద తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Telangana State Human Rights Commission)కు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. అజ్మీరా లక్య (Ajmira Lakya) అనే గిరిజన వృద్ధ రైతు యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి సొమ్మసిల్లి పడిపోగా అతడికి గాయాలయ్యాయి. అయితే, ఆ ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనకు కారణాలు తెలుసుకోవాలని జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






