Allu Arjun: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు మరో ఊరట

by Prasad Jukanti |

అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు మరో ఊరట కల్పించింది.

Allu Arjun: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు మరో ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన (Sandhya Theater Incident Case) కేసులో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) కు మరో ఊరట లభించింది. ప్రతి అధివారం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు హాజరుకావాలన్న షరతు నుంచి నాంపల్లి కోర్టు (Nampally Court) మినహాయింపు ఇచ్చింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 3వ తేదీన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. రూ. 50 వేల రెండు పూచీకత్తులను, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్ కు (Chikkadapally PS) హాజరుకావాలని, సాక్షులను ప్రభావింతం చేయొద్దని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్ కు స్వయంగా హాజరై సంతకం చేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ షరతు నుంచి అల్లు అర్జున్న కోర్టును మినహాయింపు కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు ప్రతి ఆదివారం సంతకం చేయడం నుంచి మినహాయింపు ఇచ్చింది.

Next Story