- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
I Bomma: ఐ బొమ్మ రవి కేసులో కీలక పరిణామం.. సీన్ లోకి మరో వ్యక్తి ఎంట్రీ
తెలుగు సినీ ప్రపంచంలో సంచలనంగా మారిన ఐబొమ్మ వెబ్‍సైట్ (iBomma Website Case) నిర్వాహాకుడు ఇమ్మడి రవి , (Imandi Ravi) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రవి మరో వ్యక్తి పేరుతో పాన్ కార్డు, లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు సినీ ప్రపంచంలో సంచలనంగా మారిన ఐబొమ్మ వెబ్‍సైట్ (iBomma Website Case) నిర్వాహాకుడు ఇమ్మడి రవి , (Imandi Ravi) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులోకి మరో వ్యక్తి వచ్చి చేరారు. ప్రహ్లాద్ అనే వ్యక్తిని తాజాగా పోలీసులు విచారించారు. ప్రహ్లాద్ వెల్లేల (Prahlad) పేరిట ఇమ్మడి రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లను ఇమ్మడి రవి దొంగలించి ఆయన పేరుతో వీటిని తీసుకు్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రహ్లాద్ తన రూమ్ మేట్ అని గతంలో రవి పోలీసులకు చెప్పారు. దీంతో బెంగళూర్ నుంచి ప్రహ్లాదన్ ను పిలిపించిన పోలీసులు.. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న రవి ఎదుటే ప్రహ్లాద్ ను విచారించారు. అయితే ఇమ్మడి రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో రవి పాన్ కార్డు, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ కు గురయ్యానని ప్రహ్లాద్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ప్రహ్లాద్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కాగా రేపటితో ఇమ్మడి రవి పోలీసు కస్టడీ ముగియనుంది. ఈకేసులో దర్యాప్తులో కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తుండటంతో దర్యాప్తు ముగిసే నాటికి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.






