- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ కల్లు ఘటన.. మరొకరు మృతి
by Naga Rani Yarlagadda |
కల్తీకల్లు ఘటనలో మరొకరు మృతి చెందడంతో.. మృతుల సంఖ్య 6కి పెరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కల్తీకల్లు ఘటనలో మరొకరు మృతి చెందడంతో.. మృతుల సంఖ్య 6కి పెరిగింది. ఈఎస్ఐ ఆస్పత్రి (ESI Hospital)లో చికిత్స పొందుతూ నర్సమ్మ అనే మహిళ మరణించింది. ప్రస్తుతం నిమ్స్ లో 31 మంది బాధితులు పొందుతున్నారు. వారిలో నలుగురికి డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారు.
కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శేరిలింగంపల్లిలోని కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి మంగళవారం కొందరు అస్వస్థతకు గురవ్వగా.. 24 గంటల్లో ఐదుగురి పరిస్థితి విషమించి మరణించారు. నారాయణగూడ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా.. కొన్ని కల్లు దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం అనే మత్తుమందు కలిపి విక్రయించినట్లు తేలింది. దీంతో పలు దుకాణాల లైసెన్సులను రద్దు చేసినట్లు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
Next Story






