- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సృష్టి ఫెర్టిలిటీ కేసులో దూకుడు పెంచిన పోలీసులు.. మరొకరు అరెస్టు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో (Srusti Fertility Case) పోలీసులు దూకుడు పెంచారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో (Srusti Fertility Case) పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడి సహా మొత్తం 11 మంది అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణ అనే మరో ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 12కు చేరింది. కాగా, అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఏజెంట్లకు డాక్టర్ నమ్రత భారీగా నజరానాలు ఇచ్చి శిశువుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు తెలిపారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బులతో హైదరాబాద్, ఏపీలో ఫామ్‌హౌస్, భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.






