‘బండి’కి మరో నోటీసు.. జైల్లోనే విచారించనున్న ‘సిట్’

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-06 07:24:36  IST  )

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను మరో కేసులో విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.

‘బండి’కి మరో నోటీసు.. జైల్లోనే విచారించనున్న ‘సిట్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టయ్యి కరీంనగర్ జైలులో ఉన్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను మరో కేసులో విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ప్రశ్నా పత్రాల లీక్ కేసులోనూ ఆయనకు ఏమైనా సంబంధం ఉన్నదేమోనని విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సిద్ధమవుతున్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఒకరికి బండి సంజయ్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ‘సిట్’ బృందం ఈ దిశగా ఆలోచిస్తున్నది. ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్నందున అక్కడికే వెళ్ళి ప్రశ్నించాలని భావిస్తున్నది. టీఎస్పీఎస్సీ కేసులో ‘సిట్’ గతంలోనే బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చింది. కానీ ఆయనకు బదులుగా న్యాయవాదులు హాజరై వివరణ ఇచ్చారు. ఇప్పుడు జైల్లోనే ఉన్న ఆయన దగ్గరకే వెళ్ళి విచారించాలని భావిస్తున్నది.

ఇవి కూడా చదవండి: సంజయ్ అరెస్టుపై పోరుకు కార్యకర్తలంతా సిద్ధం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Next Story