- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: తెలంగాణలో త్వరలో మరో కొత్త రాజకీయ పార్టీ!.. రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో జోరుగా చర్చలు
తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీల ట్రెండ్ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో త్వరలోనే మరో కొత్త పార్టీ (New Political Party) పురుడు పోసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో న్యూ పార్టీ లాంచ్ కోసం పెద్ద ఎత్తున చర్చలు, సంప్రదింపులు సైతం జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నూతన పార్టీని అనౌన్స్ చేయగా, బీఆర్ఎస్‍కు గుడ్ బై చెప్పిన కల్వకుంట్ల కవిత సైతం కొత్త పార్టీ దిశగా పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సైతం రాజకీయ చదరంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
బీసీ సెంట్రింక్‍గా పార్టీ!
రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు బీసీ సెంట్రింగ్‌గా నడుస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఏ పార్టీ అయినా బీసీల ఉనికిని విస్మరించి ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో గత కొంత కాలంగా బీసీల్లో చైతన్యం కోసం పని చేస్తున్న బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు (Retired IAS, Chiranjeevulu) ఆధ్వర్యంలో కొత్త రాజకీయ వేదిక రెడీ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బీసీలకు జరుగుతున్న అన్యాయాల పట్ల పుస్తకాలు, స్పీచ్‍ల రూపంలో తన గళం వినిపిస్తున్న చిరంజీవులు.. రాజకీయ పార్టీ స్థాపించే దిశగా ఆలోచన చేస్తున్నారని ఈ మేరకు పలువురు మేధావులతో చర్చలు సైతం జరుపుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో త్వరలోనే కీలక ప్రకటన సైతం ఉండబోతున్నదనే, బీసీల కోసం పోరాటం చేస్తున్న ఆయన బీసీ సెంట్రింక్‍గా పార్టీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
తీన్మార్ మల్లన్న తర్వాత మరో పార్టీ:
బీసీలకు ఆత్మగౌరవం, అధికారం, వాటా నినాదంతో ఇటీవలే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మల్లన్న పార్టీ పేరులో బీసీ ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీఆర్పీ పేరుతో తన పార్టీని అనౌన్స్ చేశారు. కానీ బీసీల కోసం ప్రయత్నాలు చేస్తున్న చిరంజీవులు పార్టీ పెట్టాలనేదే తన ప్రయత్నమే అయితే ఆ పార్టీకి ఏ పేరు పెట్టబోతున్నారు? ఎప్పటి లోపు అనౌన్స్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.






