తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ

by Disha Web Desk 2 |
తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుసేన పార్టీ పేరుతో పార్టీని స్థాపించారు. అయ్యప్ప దీక్ష, ప్రశ్నిస్తా, సర్దార్ చిన్నపరెడ్డి సహా మొత్తం 53 చిత్రాలకు సత్యారెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. కాగా, తెలంగాణలో మొన్నే అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు అందరి దృష్టి లోక్‌సభ ఎన్నికలపై పడింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో సత్యారెడ్డి రాజకీయ పార్టీ పెట్టడం అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed