తెలంగాణలో మరో కొత్త డిస్కమ్.. అధికారులకు CM రేవంత్ ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-30 16:49:03  IST  )

రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ (Discom) ఏర్పాటు కానుంది. ఇవాళ బంజారా‌హిల్స్‌లోని కంట్రోల్ కమాండ్ సెంటర్‌ (Control Command Center)లో ఇంధన శాఖపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తెలంగాణలో మరో కొత్త డిస్కమ్.. అధికారులకు CM రేవంత్ ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ (Discom) ఏర్పాటు కానుంది. ఇవాళ బంజారా‌హిల్స్‌లోని కంట్రోల్ కమాండ్ సెంటర్‌ (Control Command Center)లో ఇంధన శాఖపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఉచిత విద్యుత్ పథకాలను కొత్త డిస్కమ్‌ పరిధిలోని తీసుకురావాలని సూచించారు. కొత్త డిస్కమ్ పరిధి రాష్ట్రం అంతటా ఉండాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

డిస్కమ్ ఆర్థిక స్థితి మెరుగయ్యేందుకు సంస్కరణలు తప్పనిసరి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిస్కమ్‌లను పునర్‌ర్వవ్యస్థీకరించి విద్యుత్ సంస్థలపై రుణ భారాన్ని తగ్గించాలని పేర్కొన్నారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు ప్రణాళికలు కూడా వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రుణాలపై 10 శాతం వరకు వడ్డీల వల్ల డిస్కమ్‌లు డీలా పడ్డాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సోలార్ విద్యుత్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అందుకు అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

Next Story