- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BC JAC: బీసీ ఉద్యమం మళ్లీ ఉస్మానియా నుంచి..! 42% రిజర్వేషన్‌ల కోసం సమరశంఖం
బీసీ రిజర్వేషన్‌ల సాధన కోసం మరో మహా ఉద్యమానికి బీసీ సంఘాల విద్యార్థి నాయకులు సమరశంఖం పూరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (BC reservation) బీసీ రిజర్వేషన్‌ల సాధన కోసం మరో మహా ఉద్యమానికి (BC associations) బీసీ సంఘాల విద్యార్థి నాయకులు సమరశంఖం పూరించారు. ఇవాళ (సోమవారం) ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) కేంద్రంలో అన్ని బీసీ కులాల సంఘాల ప్రతినిధులు, విద్యార్థి నాయకులు పాల్గొని అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్‌ల సాధన కోసం (Telangana Movement) తెలంగాణ ఉద్యమం తరహాలో సమగ్ర ప్రణాళికతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉస్మానియా యూనివర్సిటీని కేంద్రంగా తీసుకొని అన్ని యూనివర్సిటీల బీసీ విద్యార్థి సంఘాలను, యువజన, కుల సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావాలని తీర్మానించారు.
తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన వంట వార్పు, సకల జనుల సమ్మె, సాగరహారం, రహదారుల దిగ్బంధనం వంటి కార్యక్రమాల మాదిరిగా, అదే స్థాయిలో బీసీ ఉద్యమాన్ని నిర్మించేందుకు నిర్ణయించుకున్నట్లు నాయకులు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో బీసీ జేఏసీ (BC JAC) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డా. వట్టికూటి రామారావు గౌడ్, డా. బొమ్మ హన్మంత్ రావు, డా. సాంబశివ గౌడ్, డా. నిజ్జన రమేష్ ముదిరాజ్, డా. వీరు యాదవ్, డా. ఆర్.ఎన్. శంకర్, జగన్ ముదిరాజ్, డా. ఏలేందర్ యాదవ్, అరుణ్‌కుమార్ ప్రజాపతి, పూసల రమేష్, రామ్ గౌడ్, బొమ్మ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.






