- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్లపై మరో బిగ్ అప్‌డేట్.. నగర పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి టెండర్లు
క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇవాళ ఆయన నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లుగా ప్రకటించారు. అయితే, ఈ భారీ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఏర్పాట్లపై కేబినెట్ భేటీకి ముందుకు మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలో లక్ష ఇళ్లకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ మరో రెండు, మూడు రోజుల్లోనే పూర్తిగా ముగుస్తుందని స్పష్టం చేశారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం..
నగర పరిధిలోని మొత్తం 19 నియోజకవర్గాల్లో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లుగా మంత్రి పొంగులేటి తెలిపారు. ఫేజ్-1లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 నుంచి 1000 ఇళ్ల చొప్పున నిర్మాణ పనులను మొదలుపెడతామని అన్నారు. ఆ తర్వాత వచ్చే రెండు, మూడు విడతల్లో మిగిలిన ఇళ్లను కూడా మంజూరు చేసి, లబ్ధిదారులకు అందజేస్తామని, పేదోడి సొంతింటి కళను నెరవేర్చడమే తమ ముందు ఉన్న లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.






