పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు

by Malleboina Mahesh |

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావంతో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (low pressure) తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావంతో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆ అల్పపీడనం ఈ రోజు రాత్రికి లేదా.. రేపటి ఉదయానికి వాయుగుండం (Vayugundanga)గా మారనున్నట్లు వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. అయితే ఈ వాయుగుండంగా మారిన శనివారం సాయంత్రం ఉత్తర కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండబోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారుల అంచనా ప్రకారం ఈ రోజు తెలంగాణలోని 12 జిల్లాల్లో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు (Heavy rains) కురవనున్నాయి.

దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, పెద్దపల్లి.. భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert), కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రేపు తెలంగాణ మధ్యలో ఉన్న 7 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange Alert) ప్రకటించారు. అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేటలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా రాత్రి, రాత్రిపూట, తెల్లవారుజామున మోడరేట్ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Next Story