- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అలా ఉంటేనే మంత్రి పదవి వస్తది’.. జడ్చర్ల ఎమ్మెల్యేకు మావోయిస్టుల మరో లేఖ
ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆయన సొంత గ్రామం రంగారెడ్డిగూడెంలో మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపిన విషయం తెలిసిందే.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆయన సొంత గ్రామం రంగారెడ్డిగూడెంలో మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే.. లచ్చన్న దళం పేరుతో జడ్చర్ల ఎమ్మెల్యే ఇంటి అడ్రస్‌కు మరో లేఖ రావడం కలకలం సృష్టిస్తోంది. ‘ఎమ్మెల్యే గారు మంచిగా వ్యవహరించు. పెద్దవారికి ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. పైసలు ఉన్నాయని నీలుగకు’ అంటూ లచ్చన్న దళం పేరుతో లేఖను పంపారు. ‘గర్వం ఉంటే ఎప్పటికీ మంత్రివి కాలేవు. అందరితో మంచిగా ఉంటేనే మంత్రివి అవుతావు. మొన్న రంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు ముస్లింలతో పాటు మరో వ్యక్తిని పట్టుకుపోయిన విషయం మరువకు. దయచేసి జాగ్రత్తగా ఉండు.. ఇట్లు లచ్చన్న దళం’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. గ్రామంలో వెలిసిన పోస్టర్లు మావోయిస్టులవి కాదని.. గ్రామస్తులే ఈ పనిచేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.






