బ్రేకింగ్: గజ్వేల్ ప్రజలకు సీఎం KCR మరో కీలక హామీ

by Satheesh |   (  Updated:2023-11-28 10:30:44  IST  )

గజ్వేల్ ప్రజలకు సీఎం కేసీఆర్ మరో కీలక హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా

బ్రేకింగ్: గజ్వేల్ ప్రజలకు సీఎం KCR మరో కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: గజ్వేల్ ప్రజలకు సీఎం కేసీఆర్ మరో కీలక హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ఒక్క విడతలోనే గజ్వేల్‌లో దళితబంధు అమలు చేస్తామని కీలక హామీ ఇచ్చారు. అంతేకాకుండా గజ్వేల్‌కు కచ్చితంగా ఐటీ టవర్లు తీసుకువస్తానని మాట ఇచ్చారు. కొండ పోచమ్మ ఆలయాన్ని మరింత అద్భుతంగా మార్చుకుందామన్నారు.

బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్ ఒక రోల్ మోడల్‌గా ఎదిగిందని.. గజ్వేల్ అభివృద్ధిని చూడటానికి వివిధ ప్రాంతాల నుండి తండోపతండాలుగా వచ్చారని అన్నారు. అన్ని రాష్ట్రాల నుండి వచ్చి కోమటిబండ అభివృద్ధి చూశారని గుర్తు చేశారు. గజ్వేల్‌లో రెండు సార్లు నన్ను గెలిపించారని.. ఈసారి ఆశీర్వదిస్తే కొండ పోచమ్మ, మల్లన్న సాగర్‌ను మరింత అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఇవాళ గజ్వేల్ పాల్గొన్నది 96వ సభ అని.. ఇదే తన చివరి సభ అని కేసీఆర్ తెలిపారు.

Next Story