తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా నలుగురు మంత్రులకు కమిటీలో చోటు దక్కింది. అభివృద్ధి పనుల పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన కోసం కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా నీటిపారుదల శాఖ, ఐటీ శాఖ, ఆర్ అండ్ బి శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు కమిటీ అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story