- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో కేరళ ఫైల్స్ తరహా ఉదంతం.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అరెస్ట్
కేరళలో యువతి ఆత్మహత్య కేసులో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సుహైల్ అన్సారీ అరెస్ట్ అయ్యారు. యువతి వేధింపులకు సంబంధించి లభించిన డైరీ నోట్స్, వాట్సాప్ చాట్స్ ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో జరిగిన ఓ ఉదంతం కేరళ ఫైల్స్ (Kerala Files)ను తలపిస్తోంది. తాజాగా రేణు అనిల్ (Renu Anil) అనే యువతి అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సుహైల్ అన్సారీ (Suhail Ansari)ని ఏనాథ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు (Abetment of Suicide) ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కొల్లాం జిల్లాకు చెందిన రేణు అనిల్ ఇటీవల తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. ముందు ఆమెది ఆత్మహత్యగా భావించినప్పటికీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న రేణు డైరీలో సుహైల్ అన్సారీ పేరు ప్రస్తావించినట్లుగా సమాచారం. తన మృతికి సుహైలే కారణమని ఆమె అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను పోలీసులు విశ్లేషించారు. ఈ చాట్స్ ద్వారా సుహైల్ ఆమెను మానసిక వేధింపులకు గురిచేసినట్లుగా ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. మరణానికి ముందు సుహైల్ నుంచి ఆమెకు పదేపదే కాల్స్ వచ్చినట్లుగా పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు.
కాగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేత ఈ కేసులో అరెస్ట్ కావడంతో కేరళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సుహైల్ అన్సారీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తుదుపరి విచారణలో తేలాల్సి ఉంది.






