- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన.. చెల్లిపై అత్యాచారం, హత్య
పక్కింటో ఉండే వివాహితపై ఓ కామాంధుడు ఘోరమైన చర్యకు ఒడిగట్టాడు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది పక్కింటో ఉండే వివాహితపై ఓ కామాంధుడు ఘోరమైన చర్యకు ఒడిగట్టాడు. చెల్లి అని పిలుస్తూనే ఇంట్లో ఎవరులేని సమయంలో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించటంతో హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన సిరిసిల్ల (Sirisilla) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..
గంభీరావుపేట మండలంలోని గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహిత పక్కింట్లో ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్‌లో ఉండగా.. ఆమె అత్తమామ, పిల్లలతో జీవిస్తుంది. ఈక్రమంలో పక్కింట్లో ఉండే శ్రీకాంత్ రేఖను చెల్లి అని పిలుస్తూ పరిచయం పెంచుకున్నాడు. అయితే, శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో రేఖ ఒంటరిగా ఉన్న సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించటంతో కొడవలితో ఆమెను నరికి చంపేశాడు. అనంతరం భయంతో తను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేఖ ఒంటిపై పంటి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, చెల్లి అని పిలిచే వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.






